తెలంగాణ వీణ , హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల అఫిడవిట్లలో ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీ చేస్తున్న మాజీ ఎంపీ వివేక్.. సీఎం కేసీఆర్‌కు రూ.కోటి అప్పు ఇచ్చినట్టుగా తన అఫిడవిట్‌లో పేర్కొన్నా రు. అదేవిధంగా రామలింగారెడ్డికి రూ.10లక్షలు, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి రూ.1.50కోట్లు అప్పుగా ఇచ్చినట్టు వెల్లడించారు
మొత్తంగా రూ.23.99 కోట్లను వ్యక్తిగత అప్పులు ఇచ్చినట్లుగా పేర్కొన్న వివేక్ ఆయనకు రూ. 600 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. ఆస్తుల విషయంలో ఈ మాజీ ఎంపీ రాష్ట్రంలోనే అత్యధిక ఆస్తులున్న రాజకీయ నాయకుడిగా ఉన్నారు. ఆయన సతీమణి జి.సరోజ పేరుతో రూ.377కోట్లు ఉండగా, విశాఖ కంపెనీతో సహా పలు కంపెనీలు, మీడియా సంస్థల్లో పెట్టుబడులు ఉన్నట్లు తెలిపారు.