తెలంగాణ వీణ , జాతీయం : తృణమూల్ కాంగ్రెస్ నేతపై కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ నేపథ్యంలో టీఎంసీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఒక అనుమానిత వ్యక్తిని కొట్టి చంపారు. పలు ఇళ్లకు నిప్పుపెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాస్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం జాయ్‌నగర్‌లో ఇంటి బయట ఉన్న టీఎంసీ నాయకుడు సైఫుద్దీన్ లస్కర్‌పై కాల్పులు జరిపి చంపారు. బముంగాచి ప్రాంత తృణమూల్ విభాగానికి ఆయన నాయకత్వం వహిస్తుండగా, అతడి భార్య సర్పంచ్‌గా ఉన్నారు.
కాగా, టీఎంసీ నాయకుడు లస్కర్‌పై కాల్పులు జరిపి చంపడంపై ఆయన అనుచరులు చెలరేగిపోయారు. ఒక అనుమానిత వ్యక్తిని పట్టుకుని దారుణంగా కొట్టి చంపారు. అలాగే ఆ ప్రాతంలోని పలు ఇళ్లకు నిప్పుపెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.