తెలంగాణ వీణ హైదరాబాద్ : బీజేపీ తెలుగు రాష్ట్రాలలో రాజకీయ సామాజిక సమీకరణలను బేరీజు వేసుకుంటూ దూకుడుగా ముందుకు సాగుతోంది. ట్రెడిషనల్ గా కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే పరిమితం అయిన సీఎం కుర్చీ మిగిలిన వర్గాలకు కూడా దక్కాలన్నది బీజేపీ వ్యూహం. ఇది సామాజిక ఎత్తుగడ కూడా. తెలంగాణాలో బీసీలు అధికంగా ఉన్నారు.
దాంతో బీజేపీ బీసీ సీఎం నినాదం అందుకుంది. ఇక మరో నాలుగైదు నెలలలో ఏపీలోనూ ఎన్నికలు ముంచుకు వస్తున్నాయి. ఏపీలో బీజేపీ సామాజిక నినాదం ఏంటి అన్నది చర్చకు వస్తోంది. ఏపీలో రాజ్యాధికారానికి దూరంగా కాపులు, బీసీలు ఉన్నారు. ఇప్పటిదాకా ఈ సామాజిక వర్గాలు మంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా పనిచేశారు కానీ సీఎం పోస్టు మాత్రం చేపట్టలేదు
దాంతో ఈసారి వారికి చాన్స్ ఇవ్వాలన్నది బీజేపీ స్లోగన్ గా ఉండబోతోంది అని అంటున్నారు. తెలంగాణాలో బీజేపీ జనసేన మాత్రమే పొత్తూలలో ఉన్నాయి. కాబట్టి బీసీ సీఎం అని 111 చోట్ల తన అభ్యర్ధులను నిలబెట్టిన బీజేపీ సోలోగా ప్రకటించగలిగింది. అదే ఏపీలో అలా ఉంటుందా అన్నది చూదాల్సి ఉంది.