తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : తెలుగుదేశం పార్టీ నాయకుల ఓట్ల తొలగింపుపై ఫాం 7 దరఖాస్తులు కలకలం రేపుతున్నాయి. ఫామ్-7 అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు వందలాది ఓట్లను తొలగించాలని దరఖాస్తు చేయడం గుంటూరులో రచ్చ లేపుతోంది. ఉద్దేశపూర్వకంగా తమ ఓట్లు తొలగిస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరపాలక సంస్థ అధికారులను కలిసి టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫాం 7 దరఖాస్తు చేసింది వైసీపీ వారేనని టీడీపీ నేతలు ఆధారాలు సమర్పించారు. బతికున్న వారి ఓట్లు తొలగించాలని ఫాం 7 ఇచ్చిన వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.