Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఉదయం నడక మానండి.. టపాసులు కాల్చకండి..

Must read

 తెలంగాణ వీణ , న్యూ ఢిల్లీ : ఉదయం నడక మానండి..టపాసులు కాల్చకండి..ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోండి.. వాయు కాలుష్యం కొనసాగుతున్న వేళ దేశ రాజధాని వాసులకు ఢిల్లీ ఆరోగ్య శాఖ జారీ చేసిన సూచనలివి. శనివారం అన్ని ప్రధాన వార్తాపత్రికల్లో ఈ మేరకు సూచనలు ప్రచురించింది. ఇక కాలుష్యంతో రెండు వారాలుగా ఇబ్బంది పడుతున్న జనానికి వర్షం ఊరట ఇచ్చింది. దేశ రాజధాని ప్రాంతంలో గురువారం వాయు నాణ్యత ఇండెక్స్‌(ఏక్యూఐ) 437 కాగా, శనివారం ఉదయం ఏక్యూఐ 219కి పడిపోయింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you