తెలంగాణ వీణ, మెదక్ : రామాయంపేట మండలంలోని దంతెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని జామ్లా, బిక్షపతి, బిల్యానాయక్, శభాష్ తాండలకు చెందిన 50 మంది యువకులు బిఆర్ ఎస్ పార్టీ కార్యాలయానికి తరలివచ్చి పార్టీ లో చేరారు. వీరికి బి ఆర్ ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిచ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే యువతకు న్యాయం జరుగుతుందని తెలిపారు. పద్మాదేవేందర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపిస్తామని అన్నారు.
Tweetబిఆర్ ఎస్ లోకి మెదక్ యువకుల చేరిక.. pic.twitter.com/oJux2bOUre
— GS9TV Telugu News (@Gs9tvNews) November 11, 2023