తెలంగాణ వీణ , సినిమా : ప్రముఖ నటుడు చంద్రమోహన్ మృతిపట్ల ముక్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చంద్రమోహన్ .. దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించారని.. ఆయన మృతి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరనిలోటన్నారు. ఆయన స్ఫూర్తితో ఎందరో నటీనటులుగా ఎదిగారని చెప్పారు. తెలుగు, ఇతర భాషల్లో లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారని తెలిపారు.
ప్రముఖ నటులు చంద్రమోహన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో దవాఖానలో శనివారం ఉదయం 9.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు.