తెలంగాణ వీణ, మెదక్ : వెల్దుర్తి మండలం శేరిల్లా గ్రామంలో మల్లన్న దేవాలయంలోని దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కవుల రాజిరెడ్డిని గెలిపించాలని కోరుతూ రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తీసుకొచ్చే ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరించారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా అన్ని వర్గాలను మోసం చేసిందని ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్ మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ సీనియర్ నాయకుడు అన్వేష్ కలాల్ శేఖర్ గౌడ్ వెల్దుర్తి టౌన్ అధ్యక్షుడు మహేష్ డాకులు యాదవ్ సత్యనారాయణ నవీన్ కృష్ణ కుమార్ శంకర్ రవితేజ వెంకటరెడ్డి కలాల్ శేఖర్ గౌడ్ యాద గౌడ్ అంజయ్య నారా గౌడ్ మల్లేశం షఫీ వెంకట్ రెడ్డి గోగుల కృష్ణ ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Tweetజోరుగా కొనసాగిన కాంగ్రెస్ అభ్యర్థి కవుల రాజిరెడ్డి ఇంటింటి ప్రచారం.. pic.twitter.com/mQfwbeLfyQ
— GS9TV Telugu News (@Gs9tvNews) November 11, 2023