తెలంగాణ వీణ, మెదక్ : బిఆర్ ఎస్ అభ్యర్థిగా శాసనసభ ఎన్నికల్లో మూడోసారి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి కి మెదక్ పట్టణంలో ప్రజల నుంచి చక్కటి స్పందన లభిస్తుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ పట్టణంలోని 20,21,22,23 తదితర వార్డుల్లో ఇంటింటికీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ‘పద్మక్క వచ్చావా’ అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ‘మళ్లీ నీవే గెలవాలి, మెదక్ మరింత అభివృద్ధి చెందాలి’. అంటూ ఆడబిడ్డగా తమ ఇళ్లలోకి తీసుకెళ్లి పసుపు, కుంకుమ అందచేశారు. ఓ హోటల్ లో పూరీలు వేసి, బట్టలు ఇస్త్రీ చేసి, కుట్టు మిషన్ పై బట్టలు కుడుతూ ఓటు వేయాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే కుల వృత్తులపై ఆధారపడి జీవించేవారి బతుకులు మెరుగయ్యాయని చెప్పారు. 10 ఏళ్ల క్రితం మెదక్ అభివృద్ధి లో యేస్థితిలో ఉందో? ప్రస్తుతం ఏవిధంగా అభివృద్ధి చెందిందో గుర్తించి తనకు ఓటేయాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తనను గెలిపిస్తే మెదక్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. ముందుగా పట్టణంలోని వెంకటేశ్వర ఆలయంలో పద్మా దేవేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, బి ఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గంగాధర్, ఆయా వార్డుల కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ గౌడ్, నిర్మల, చందన సుమన్, కృష్ణారెడ్డి నాయకులు చంద్రకళ, రాగి అశోక్, కృష్ణ, మధుసూదన్ రావు, ప్రభు రెడ్డి, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tweetపల్లె పట్నం పద్మక్క వైపే… మెదక్ లో బ్రహ్మరథం పట్టిన ప్రజలు pic.twitter.com/sck6mx0osS
— GS9TV Telugu News (@Gs9tvNews) November 11, 2023