తెలంగాణవీణ , మల్కాజిగిరి; బీజేపీ ద్వారనే అభివృద్ది సాధ్యమని బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఎన్, రాంచందర్ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో బాగంగా నియోజకవర్గంలోని అల్వాల్ సర్కిల్ అంజనాపురి కాలనీ, జ్యోతినగర్, వేంకటేశ్వర కాలనీ, చంద్రనగర్ కాలనీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు కాలనీలో నెలకొన్న సమస్యలు తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదిస్తే నియోజవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్ధుతానన్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ నిస్వార్థంగా ప్రజా సేవను అందిస్తానన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మాయమాటలకు మోసపోవద్ధని బీజేపీనే గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో మల్కాజిగిరి కోకన్వీనర్ మల్లికార్జున్ గౌడ్, తాళ్ల వినయ్, శంకర్, అజయ్ రెడ్డి, మోయి సుజాత, శ్రీనివాస్, రామ్మోహన్ గౌడ్, ఉదయ్, మహేష్, రాజిరెడ్డి, గోపి, స్థానిక కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.