తెలంగాణ వీణ,శామీర్‌పేట: బిఆర్ఎస్ కి భారీషాక్ తగిలింది. బిఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ ఫోరమ్ అధ్యక్షుడు సరసం అశోక్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయనతో పాటుగా మజీద్ పూర్ గ్రామ 3వ వార్డ్ సభ్యుడు నటకరి బాబు ముదిరాజ్, బిఆర్ఎస్ గ్రామ యూత్ అధ్యక్షుడు అబ్బాగౌని వినోద్ గౌడ్, వల్లపు మహేష్, గొట్టిముకుల మహేష్, గిర్మపురం ఉపేందర్ శుక్రవారం మాజీ ఏమ్మెల్యే సుదీర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వైఎస్ గౌడ్, కో అప్షన్ సభ్యుడు ముజీబ్, నాయకులు నర్మధ, మహేందర్ యాదవ్, విష్ణు గౌడ్, కృష్ణారెడ్డి, యాదగిరి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.