తెలంగాణవీణ, కాప్రా ; ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందమల పరమేశ్వర్ రెడ్డి నామినేషన్ ర్యాలీ కోసం జనాన్ని పిలిచి ఇస్తామన్న పైసలివ్వలేదంటూ బాధితులు ఆందోళనకు దిగారు. సైనిక్ పురి చౌరస్తా నుంచి గురువారం ఉప్పల్ మున్సిపల్ కార్యాలయం వరకు ఆర్భటంగా బైక్ ర్యాలీ కోసం వచ్చిన కార్యకర్తలను పట్టించుకోలేదంటూ మహేష్ నగర్ లో ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరమేశ్వర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా బారీ ర్యాలి చేపట్టారు. ఈర్యాలి కొసం ఇతర ప్రాంతాల నుంచి ఒక్కొక్కరికి రూ. 800 ఇస్తామని పిలిపించి, పైసా కూడ ఇవ్వలేదనీ, ఇస్తామన్న డబ్బులు ఇవ్వకుండా రూ 400 ఇస్తామంటూ మాట మార్చి తప్పించుంటున్నారనీ ఆరొపించారు. కూలీ పని వదులుకుని వస్తే తిండి లేక, నీళ్లు లేక ఇబ్బందులు పెట్టారానీ ఇస్తామన్న డబ్బులివ్వడం లేదన్నారు. సుమారు 150 మంది వస్తే పైసా కూడ ఇవ్వకుండా మోసం చేస్తున్నారన్నారు. కూలీ వదుకుని బైక్ లలో పెట్రోల్ కూడ తమ సొంత డబ్బులే పెట్టుకున్నామన్నారు. ఉదయం నుంచి రాత్రి తొమ్మిది వరకు డబ్బులివ్వకుండా ఎగ్గోట్టే ప్రయత్నం చేస్తున్నారనీ, ఏలాగైనా తమకిస్తామన్న డబ్బులు ఇప్పించాలని కోరుతున్నారు. పిలిపించిన పార్టీ నాయకులు తీరా సగమే ఇస్తాం , మీ ఇష్టం వచ్చింది చేసుకొండి అంటూ నిర్లక్షంగా సమాదానం ఇస్తున్నారని చెబుతున్నారు. ఇస్తామన్న డబ్బులివ్వకుంటే వారి ప్రచారాన్ని అడ్డుకోవడానికైనా సిద్ధమేనంటున్నారు.