తెలంగాణ వీణ, ఉప్పల్ : ఉప్పల్ నియోజకవర్గం,మల్లాపూర్ డివిజన్, వియన్ఆర్ గార్డెన్స్ లో బీఆర్ఎస్ ఉప్పల్ నియోజక ఎమ్మేల్యే అభ్యర్థి బండారి లక్ష్మా రెడ్డి కి మద్దతుగా మహిళ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వైద్య,ఆరోగ్య మరియు ఆర్ధిక శాఖ మంత్రివర్యులు హరీష్ రావు ముఖ్యఅతిథిగా విచ్చేసారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీ పుర్ రాజు ,ఎమ్మేల్యే భేతి సుభాష్ రెడ్డి, ఎన్నికల ఇంచార్జీ రావుల శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, పలువురు బిఅర్ఎస్ మహిళా కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, దాదాపు 5000 మంది పార్టీ మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.