తెలంగాణ వీణ,శామీర్‌పేట: మేడ్చల్ నియోజకవర్గం శామీర్పేట్ మండల కేంద్రం లోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో జరుగుతున్న కళ్యాణంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్తేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా తుంకుంట మునిసిపల్ లోని దొంగల మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రాజేశ్వర్ రావు, జడ్పీటీసీ అనిత లాలయ్య, బిఆర్ఎస్ ప్రెసిడెంట్ సుదర్శన్, మాజీ ఎంపీపీ నాలిక యాదగిరి, గౌడ్ సంగం నాయకులు, వార్డ్ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.