తెలంగాణవీణ, కాప్రా : రాష్ట్రావృద్ధిని బీఆర్ఎస్ తోనే సాధ్యమనీ, కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో బాగంగా నియోజకవర్గంలోని రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాల, హబ్సిగుడ రవీంద్ర నగర్ కాలనీ, కెప్టెన్ వీరరాజా రెడ్డి పార్క్ లో, మార్నింగ్ వాకర్స్, ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్, యోగ, మెడిటేషన్ చేస్తున్నవారిని కలిసి ఆత్మీయంగా కలుస్తూ ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో బండారి లక్ష్మారెడ్డి వినూత్నంగా కర్ర సాము చేస్తూ ఘనంగా స్వాగతం తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని, అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను, ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను వివరిస్తూ, ఉప్పల్ నియోజకవర్గంలో మరింత అభివృద్ది జరగాలంటే బిఅర్ఎస్ పార్టీతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీల అమలుకాని హామీలు నమ్మి గొసపడొద్దంటూ, తెలంగాణ రాక ముందు తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి జరింగిందో ఒక్కసారి ఆలోచించి బీఆర్ఎస్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్ధించారు. మీర్పేట్ హౌసింగ్ బోర్డ్ డివిజన్, కైలాసగిరి కాలనీ నుండి ఇంటింటికి తిరుగుతూ, నియోజకవర్గానికి ఎంతో సుపరిచితుడుగా ఆత్మీయంగా అందర్నీ కలుస్తూ నిర్వహిస్తోన్న ప్రచారానికి విశేష స్పందన లభిస్తోంది. ప్రజల సమస్యలు ఓపికగా వింటూ, వాటికి పరిష్కార హమీలిస్తూ, కేసీఆర్ చేసిన అభివృద్ధిని, మేనిఫెస్టోను, 400లకే ఇస్తున్న గ్యాస్ ను వివరిస్తూ ప్రచారాన్ని మమ్మురంగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి కి మీర్పేట్ ఓటర్లు పూల దండలు, శాలువాలతో సత్కరిస్తూ, వీర తిలకం దిద్దుతూ మహిళా ఓటర్లు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఉప్పల్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమనీ, సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ ప్రసిడెంట్ బి.వి.చారి, సోమిరెడ్డి, పి.రవీందర్ రెడ్డి, పి.నాగేష్, కాలేరు జై నవీన్, ప్రభాకర్, బాబు యాదవ్, బాలరాజు యాదవ్, ముస్తాక్, కైలాష్ పతి, చిన్న తదితరులు పాల్గొన్నారు.