తెలంగాణ వీణ , కాప్రా : కేసీఆర్ మల్లికార్జున్ నగర్ కాలని ఓటర్లు, బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి కి తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, తమ కాలనీలోకి, కేసీఆర్ కారుకు తప్ప కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఎంట్రీనే లేదని స్పష్టం చేస్తూ,ఉప్పల్ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిపిస్తామంటూ ఏకగ్రివంగా తీర్మానం చేశారు. ఈ సందర్బంగా బండారి లక్ష్మారెడ్డి బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి, తన గెలుపుకు మద్దతు తెలిపిన కేసీఆర్ కాలని ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కాలనీలో ఉన్న సమస్యలన్నింటికీ హామీ ఇస్తూ, అందరికీ అందుబాటులో ఉండేలా 100పడకల ఆసుపత్రిని తీసుకొచ్చానని తెలుపుతూ, మేనిఫెస్టోలో పెంచిన పెన్షన్లు, 400లకే ఇస్తానన్న గ్యాస్, 15లక్షల ఇన్సూరెన్స్ లాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అర్హులైన వారందరికీ రావాలంటే, ఉప్పల్ నియోజకవర్గంలో కారు గుర్తుకు ఓటేసి బిఅర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించమని కోరారు.