తెలంగాణ వీణ,శామీర్‌పేట: అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను ఓడించి బిఆర్ఎస్ నాయకుల భరతం పట్టాల్సిందేనని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. శామీర్ పేట్ మండలం బొమ్మరాసిపెట్ ఎంపీటీసీ ఇందిరా నర్సింహ రెడ్డి, బిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ కార్తీక రెడ్డి లు సోమవారం బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ని చిత్తుగా ఓడించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, అజయ్ యాదవ్, భరత్, వెంకటేష్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.