తెలంగాణ వీణ,శామీర్‌పేట: తుంకుంట మున్సిపల్ దేవరయంజాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2006-07 బ్యాచ్ పూర్వ విద్యార్థుల 16 వ సంవత్సరం ఆత్మీయ సమ్మేళన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 50 మంది పూర్వ విద్యార్థులు పాల్గొని తమ 16 సంవత్సరాల తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించారు.ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అప్పటి ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు విజయ్ కుమార్,నర్సింగరావు, ఆనంద్ రావు,రాజ్యలక్ష్మి,శ్రీలత,ప్రసన్న,మరియు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.