తెలంగాణ వీణ , సినిమా : మనుషుల ఊహలకు రూపం ఇస్తున్న కృత్రిమ మేధ సాంకేతికత కొందరి చేతుల్లో వికృత పోకడలకు దారి తీస్తోంది. ఇందుకు తాజాగా ఉదాహరణగా నెట్టింట వైరల్ అవుతున్న నటి రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో అభిమానుల్లో ఆందోళన రేకెత్తించింది. దీనిపై ఏకంగా అమితాబ్ బచ్చన్ స్పందించిన నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వీడియోపై అభిమానుల్లో కలకలం రేగుతుండటంతో ఓ జర్నలిస్టు ఈ వీడియో వెనక వాస్తవాన్ని బయటపెట్టారు. అది డీప్ ఫేక్ ఏఐ సాంకేతికతతో తయారు చేసినదని నెటిజన్లను అప్రమత్తం చేశారు. మరో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పోస్ట్ చేసిన వీడియోకు రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేశారని వెల్లడించారు. సెలబ్రిటీలను అపఖ్యాతి పాలు చేస్తున్న నిందితులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా స్పందించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.