తెలంగాణ వీణ,శామీర్‌పేట : దళితులను నమ్మించి గొంతుకోస్తున్న కెసిఆర్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వజ్రష్ యాదవ్ అన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో భాగంగా మూడుచింతలపల్లి మండలంలోని ఉద్దేమర్రి, ఉషార్పల్లి, కేశ్వపూర్, అద్రాస్ పల్లి గ్రామాల్లో ఆదివారం ప్రచారం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలను నమ్మించి గొంతు కోస్తుందని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఉసెలేదన్నారు. ఎన్నికల కోసమే బీసీలకు బీసీ బంధు ఎరవేస్తున్నారని ఆరోపించారు. ఎలాచెప్పుకుంటూ పోతే ఈ యాడాది సరిపోదాన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ ప్రజలకు మంచిచేయాలనీ ఆరు గ్యారంటీ తీసుకు వచ్చిందన్నారు. ప్రజలను మోసం చేసే ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పే సమయం వచ్చిందన్నారు. రాజ్యంగం కల్పించిన ఓటు హక్కు తో బిఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, మండల అధ్యక్షులు నర్సింలు యాదవ్, వై ఎస్ గౌడ్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ వైద్యనాథ్, మేడబోయిన నగేష్, మాజీ సర్పంచ్ లు యాదగిరి, వెంకటేష్, మాజీ ఎంపీటీసీ రవీందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, మహేందర్ యాదవ్, నర్సింగ్ రావు, ఆనంద్, కిసరి నర్సింలు, మహేష్, బన్నీ, భూపాల్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.