తెలంగాణ వీణ, మేడ్చల్ : కారు గుర్తుకు ఓటు వేసి మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే అనేకమైన ప్రజా సంక్షేమ పథకాలను తీసుకువస్తాం అని మల్లారెడ్డి అన్నారు.. మల్లారెడ్డి కి మద్దతుగా అతని కొడుకు చామకూర భద్ర రెడ్డి, కోడలు ప్రీతి రెడ్డి ,అధ్యక్షులు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో 3000 బైక్ల తో బైక్ ర్యాలీ భారీగా నిర్వహించారు .భద్రారెడ్డి, ప్రీతి రెడ్డి మాట్లాడుతూ నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బిఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి ఉచిత నల్ల కనెక్షన్ ను ఏర్పాటు చేసినది, నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 రూపాయల కూడా ఇవ్వని పెన్షన్లు 2016 రూపాయలకు పెంచినం, మళ్లీ ప్రభుత్వం ఏర్పడితే 5000 రూపాయలకు పెంచుతాం, భూమి కలిగిన ప్రతి రైతుకు రైతుబంధు ఇచ్చినం, రైతు మరణిస్తే రైతు బీమా ద్వారా ఐదు లక్షల రూపాయల భీమా ఇస్తున్నాం గత పది సంవత్సరాలుగా ప్రభుత్వం అనేకమైన ప్రజా సంక్షేమ పథకాలను తీసుకువచ్చింది. మళ్లీ కారు గుర్తుకు ఓటు వేసి మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే అనేకమైన ప్రజా సంక్షేమ పథకాలను తీసుకువస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, కార్పొరేటర్లు ,కోఆప్షన్ మెంబర్లు, డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు ,యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.