తెలంగాణ వీణ , మల్కాజ్గిరి : మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తోనే తన ప్రయాణమని ఉదారి సత్యనారాయణ యాదవ్ అన్నారు.వివరాల్లోకి వెళ్తే మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతంనగర్ డివిజన్ పరిధిలోని భవాని నగర్ కి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఉదారి సత్యనారాయణ యాదవ్,ఆదివారం ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో టిఆర్ఎస్ కండువా కప్పుకొని పార్టీలో చేరడం జరిగింది.ఈ సందర్భంగా ఉదారి సత్యనారాయణ యాదవ్ మాట్లాడుతూ 1994 నుండి తెలుగుదేశం పార్టీ వీడకుండా నిబద్ధతగా పార్టీ లైన్లోనే ఉన్న తాను మైనంపల్లి హనుమంతరావు కోసం తెలుగుదేశం పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని స్పష్టం చేశారు. మల్కాజిగిర నియోజకవర్గంలో ప్రధాన సమస్యలైన ఆనంద్ బాగ్, ఉత్తమ్ నగర్, ఆర్ యు బి లతోపాటు మౌలాలి కమాన్ సమస్యను తీర్చి, మల్కాజ్గిరిలో ముంపు ప్రాంతాలను అభివృద్ధి చేసిన డైనమిక్ లీడర్ మైనంపల్లి హనుమంతరావు అని అన్నారు. తాను మల్కాజ్గిరి కి చేస్తున్న అభివృద్ధి కొనసాగాలంటే మళ్ళీ మైనంపల్లి హనుమంతరావే గెలవాలని, అతని గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ వీడి, మైనంపల్లి వెంట నడవడానికి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నానని అన్నారు. మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ మల్కాజ్గిరి ప్రజలు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు ప్రత్యకంగా పరోక్షంగా తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మల్కాజ్గిరి నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. రాబోయే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనని భారీ మెజారిటీతో గెలిపించాలని కాలనీ వాసులను, ప్రజలను, కోరారు.కార్యక్రమంలో భవాని నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు హేమంత్ కుమార్, ప్రధాన కార్యదర్శి ప్రేమ్ సాగర్, కార్యదర్శి కృష్ణంరాజు, శశికాంత్, లక్ష్మణ్ యాదవ్,రామారావు,రవీందర్,శంకర్, ఒబానా,బాలమణి,స్వప్న,పద్మ ,కార్తీక్ యాదవ్,కౌశిక్ యాదవ్,రాహుల్ యాదవ్,మున్నా యాదవ్, తదితరులు పాల్గొన్నారు.