తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పలాసలో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా టెక్కలిలో కృష్ణదాస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అనేక విప్లవాత్మక నిర్ణయాలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకుందన్నారు.
ప్రభుత్వం కొత్తగా 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తోంది. అండగా జగనన్న ఉన్నారనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం మళ్లీ వైఎస్సార్‌సీపీ జెండా ఎగరాలి’’ అని కృష్ణదాస్ పిలుపునిచ్చారు.