తెలంగాణ వీణ , హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కండ్లలా భావించి మానవీయ పాలనను అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు ఇలా ఒకటేమిటి అనేక పథకాలు అమలు చేస్తూ తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపారు.
అన్నింటిలో అత్యంత మానవీయ కోణంలో ఆలోచించి అమలు చేస్తున్న పథకం ఆసరా పింఛన్లు వయసు మీదపడి..కన్నబిడ్డల ఆదరణకు నోచుకోక తిప్పలు పడుతున్న వృద్ధులకు గత ప్రభుత్వాలు రెండు వందలు ఇస్తే..దానిని రెండు వేలకు పెంచి వారికి పెద్ద కొడుకులా మారాడు. ఏ కష్టం వచ్చినా చూసుకునే ఆప్తబంధువయ్యాడు.
అందుకే తిన్న రేవును, చేసిన సాయాన్ని మరువని పండుటాకులు ‘ఆసరా బంధువయ్యా నీకు వేల వేల దండాలయ్యా.. నీవు సల్లంగా ఉండి మల్లా గెలవాలయ్యా’ అంటూ చల్లని దీవెనలు అందిస్తున్నరు. అందుకు సజీవ సాక్ష్యమే ఈ చిత్రం. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రచార రథంపై ఉన్న సీఎం కేసీఆర్ ఫొటోను ఎనిమిది పదులు దాటిన ఓ వృద్ధురాలు జిల్లాలోని రాజాపేటలో మొక్కుతూ సీఎం కేసీఆర్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నది.