తెలంగాణ వీణ , హైదరాబాద్ : హోం శాఖ మంత్రి మహమూద్ అలీ కాన్వాయ్‌ని పోలీసులు ఆదివారం తనిఖీ చేశారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కళ్లకల్ చెక్ పోస్ట్ వద్ద ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు మంత్రి మహమూద్ అలీ పూర్తిగా సహకరించారు. మంత్రి వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు. తనిఖీకి సహకరించిన మంత్రికి పోలీసులు ధన్యవాదాలు తెలిపారు