తెలంగాణ వీణ , నాగర్కర్నూల్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి తల్లీకూతుళ్లు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. బట్టలు ఉతకడానికి చెరువుకు వెళ్లి తల్లి నారమ్మ(55), ఆమె కూతురు సైదమ్మ(37) మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగనోలు గ్రామంలో చోటుచేసుకుంది.
అదే గ్రామానికి చెందిన వీరిరువురు శనివారం బట్టలు ఉతకడానికి సమీపంలోని చెరువుకి వెళ్లగా ప్రమాదవశాత్తు చెరువులో పడ్డారు. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆదివారం వారి మృతదేహాలను వెలికి తీశారు. సైదమ్మ భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. తల్లీకూతుళ్ల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.