తెలంగాణ వీణ, మల్కాజ్ గిరి : బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథవాలే పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిస్తాయని ఆపార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మల్కాజిగిరి నియోజవర్గం మౌలాలిలో పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. మర్రి రాజశేఖర్ రెడ్డి విజయమే లక్ష్యంగా చేపడుతున్న ప్రచారానికి విశేష స్పందన లభిస్తోందన్నారు. పార్టీ మెనిఫెస్టోను వివరిస్తు కాలనీల్లో ప్రచారం నిర్వహించారు. డివిజన్ లోని మారుతీనగర్, శ్రామిక నగర్, ఈస్టు మారుతునగర్ ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వంశీ ముదిరాజ్, బాగ్యనంద్,సత్తన్న , అమీనద్దీన్, నర్సింగరావు, సిద్ధిఖీ, షాహీన్ , దుర్గేష్, రామకృష్ణ , మహేష్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మౌలాలి లో బీఆర్ఎస్ విస్తృత ప్రచారం
