తెలంగాణ వీణ , హైదరాబాద్ : రాంగోపాల్ పేట్ డివిజన్ లో మంత్రి తలసాని పాదయాత్ర నల్లగుట్ట, చుట్టాల్ బస్తీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మంగళహారతులు పట్టి, నుదుటన కుంకుమ తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. మా బస్తీలు బాగు చేసినవ్….మా కష్టాలు ఎన్నో తీర్చినవ్ మీకే మా ఓట్లు, మిమ్మల్ని మళ్ళీ గెలిపించుకుంటాం అంటూ ప్రచారంలో పలు చోట్ల పలువురు ఓటర్లు మంత్రికి వాగ్దానం చేశారు. ఈ సందర్బంగా మంత్రి సమక్షంలో యువత పెద్ద సంఖ్యలో పార్టీలో చేరారు. BJP మహిళా మోర్చా రాంగోపాల్ పేట డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ఆశారాణి, మహేందర్, యువత దేవేందర్, కన్నా, సాయినాద్, శ్రీకాంత్, వేణు, మధు ల ఆధ్వర్యంలో సుమారు ౩౦ మంది వరకు BRS పార్టీలో చేరారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయని తెలిపారు. సనత్ నగర్ నియోజకవర్గంను కూడా ఎంతో అభివృద్ధి చేశామని, ప్రజల అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు. 2014 కు ముందు నల్లగుట్ట ప్రాంతంలో సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేదని, తాను వచ్చిన తర్వాతనే కోట్లాది రూపాయల వ్యయంతో డ్రైనేజీ, రోడ్ల అభివృద్ధి పనులను చేపట్టినట్లు వివరించారు. అదేవిధంగా త్రాగునీటి సమస్యను కూడా పరిష్కరించినట్లు చెప్పారు. బస్తీలు, కాలనీలు అనే తేడా లేకుండా అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తిరిగి BRS పార్టీని గెలిపిస్తాయని చెప్పారు. నవంబర్ ౩౦ వ తేదీన జరిగే ఎన్నికలలో రాష్ట్రంలో BRS పార్టీ 78 స్థానాలను గెలుస్తుందని, మూడోసారి ముఖ్యమంత్రి గా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో అధికారంలోకి వస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే 400 రూపాయలకు వంట గ్యాస్ సిలెండర్, రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయబడుతుందని చెప్పారు. అదేవిధంగా 15 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందించాబడుతుందని తెలిపారు. పేద, మద్య తరగతి ప్రజల సొంత ఇంటికల ను సాకారం చేసేందుకే లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టి వాటిలో 70 వేల వరకు అర్హులకు పంపిణీ చేశామని చెప్పారు. మరో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని చేపడతామని ముఖ్యమంత్రి మేనిఫెస్టో లో ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.