Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

2024 CLAT ప్రవేశ పరీక్ష దరఖాస్తు చివరి తేదీ వారంరోజుల పొడిగింపు..

Must read

తెలంగాణ వీణ,శామీర్‌పేట: 2024 CLAT ప్రవేశ పరీక్ష దరఖాస్తు చివరి తేదీ ఒక వారం రోజుల పొడిగించడం జరిగిందని నల్సార్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ కృష్ణ దేవరావు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల కన్సార్టియం తరఫున కింది పత్రికా ప్రకటన విడుదల చేశారు . జాతీయ న్యాయ విద్యాలయాల మండలి (NLUల కన్సార్టియం), ఆ న్యాయ విశ్వవిద్యాలయాలలో ప్రవేశం కోసం రాసే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ ( Common Law Admission Test) CLAT 2024 కోసం దరఖాస్తు గడువును పొడిగించింది . 2024 విద్యా సంవత్సరానికి సంబంధించిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (“CLAT”) దరఖాస్తు తేదీని శుక్రవారం, నవంబర్ 03, 2023 నుండి శుక్రవారం 11:59 PM, నుండి నవంబర్ 10, 2023 వరకు పొడగించిందన్నారు. నేషనల్ లా యూనివర్శిటీల కన్సార్టియం (“కన్సార్టియం”) ఇరవై-మూడు సభ్యుల జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు (“NLUs”) బృందం. ఇటీవలే జరిగిన NLUల ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో CLAT 2024 కోసం చివరి తేదీని పొడిగించాలని నిర్ణయించాయి. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ కూడా ఈ కన్సార్ షియం లో ముఖ్య పాత్ర పోషస్తూ ఉన్నది .న్యాయ విద్య యొక్క ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో కన్సార్టియం స్థాపించబడింది. జాతీయన్యాయ విశ్వ విద్యాలయాలలో , ఎల్ ఎల్ బీ ( అండర్ గ్రాజువేషన్ ) ,ఎల్ ఎల్ ఎమ్ ( పోస్ట్ గ్రాజువేషన్ ) అడ్మిషన్ల కోసం ,అత్యంత సమగరమూ, న్యాయబద్ధం, అయిన అడ్మిషన్ విధానం కోసం ,కన్సార్షియం , కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) నిర్వహించడం జరుగుతున్నది . CLAT 2024 ఈ సంవత్సరం అంటే డిసెంబర్ 03, 2023న నిర్వహించ బడుతుంది . దరఖాస్తు గడువులో ఈ పొడిగింపు వలన CLAT 2024 రాయాలని భావిస్తున్న అభ్యర్థులకు దరఖాస్తు కోసం మరి కొంత సమయం దొరుకుతుందన్నారు. ఈ తేదీ పెంపు అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి . ప్రతిష్టాత్మక జాతీయ న్యాయ విశ్వ విద్యాలయాలలో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాన్ని పొందే దానికి CLAT 2024 కి హాజరయ్యే పరీక్షనే మార్గం CLAT 2024 , జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఏదైనా సహాయం కోసం, కన్సారషియం ను కింద పద్దతుల్లో సంప్రదించవచ్చు. ఇమెయిల్: [email protected] ఫోన్: 080 47162020 ఉదయం 10:00 నుండి సాయంత్రం 05:00 గంటల మధ్య).

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you