తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : తిరుపతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి, డాలర్స్ గ్రూప్ చైర్మన్ దివాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో ఆయన ఇళ్లతోపాటు ఆఫీసులు, ఆయన బంధువుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు ఒకేసారి సోదాలు జరుపుతున్నారు.సోదాల్లో భాగంగా దివాకర్ రెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో అనుమానం వచ్చిన అన్ని పత్రాలను పరిశీలిస్తున్నారని సమాచారం. ప్రకాశం రోడ్డులోని పురంధర కాంప్లెక్స్‌లోని డాలర్స్ గ్రూప్ కార్యాలయంలో ఫైళ్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఐటీ అధికారులు జరుపుతున్న ఈ దాడులు తిరుపతిలో కలకలం రేపుతున్నాయి. అయితే ఈ ఐటీ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.