Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

వరుణ్ తేజ్-లావణ్యతో రామ్ చరణ్, ఉపాసన… ఫొటోలు ఇవిగో!

Must read

తెలంగాణ వీణ, సినిమా : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాలభామ లావణ్య త్రిపాఠిల పెళ్లి సందడి ఇంకా కొనసాగుతోంది. ఈ టాలీవుడ్ లవ్ బర్డ్స్ ఇటలీలోని టస్కనీలో పెళ్లితో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుక కోసం మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోటికి చేరడంతో హంగామా మామూలుగా లేదు. కొత్త దంపతుల పెళ్లి ఫొటోలు ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో అడుగుపెడుతున్నాయి. తాజాగా, వరుణ్ తేజ్-లావణ్యలతో రామ్ చరణ్, ఉపాసన దంపతుల ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ ఫొటోలు వివాహం అనంతరం జరిగిన పార్టీకి సంబంధించినవని తెలుస్తోంది. నవంబరు 5న హైదరాబాదులో మెగా రిసెప్షన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ విందులో దాదాపు టాలీవుడ్ మొత్తం కనువిందు చేయనున్నట్టు సమాచారం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you