తెలంగాణ వీణ ,కామారెడ్డి : మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ బీఆర్ఎస్ పార్టీని నడుపుతున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు కామారెడ్డి జిల్లాలో ఎన్నికల శంఖరావం పూరించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…‘‘అవినితికి, కుటుంబ పాలనకి వ్యతిరేకంగా జరుగుతున్న యజ్ఞంలో ప్రతి ఒక్కరూ సైనికులుగా పాల్గొనాలి. పదేళ్ల కాలంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక్క సెలవు కూడా పెట్టకుండా ప్రజల కోసం పని చేశాడు. పదేళ్ల కాలంలో ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి కేసిఆర్ సెక్రటెరియట్‌కి రాలేదు. దేశంలో ఉగ్రవాదం, మతకళ్లలు లేకుండా శాంతియుతంగా పాలన కొనసాగుతుంది. ఆర్టికల్ 370ని రద్దు చేసిన ఘనత మోదీది. రక్తపు బొట్టు చిందకుండా రామమందిర నిర్మాణం కొనసాగుతుంది. డిసెంబర్ 3వ తేదీన తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలి. కామారెడ్డి నుంచి బీజేపీ అభ్యర్థి రమణారెడ్డిని గెలిపించి అయోధ్యలో రామామందిర దర్శనంకి తీసుకురావాలి. గత మూడున్నర సంవత్సరాలుగా ఉచితంగా రేషన్ బియ్యాం, ఎరువుల పైన రైతులకి సబ్సిడి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. జాతీయ రహదారులన్ని కేంద్ర ప్రభుత్వం వేస్తే, రాష్ట్ర ప్రభుత్వం వేసిందని కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నాడు. 80 వేల కోట్లు అప్పు చేసి నరేంద్ర మోదీ కాళేశ్వరం ప్రాజెక్ట్‌కి ఇస్తే కేసీఆర్ కమీషన్లు తీసుకున్నాడు. 1969లో మొదటి దశ తెలంగాణ ఉద్యమంలో 368 మంది విద్యార్థులు జై తెలంగాణ అంటే…కాంగ్రెస్ ప్రభుత్వం వారిని కాల్చి చంపింది. 1200 బిడ్డల ఆత్మబలిదానల వల్ల తెలంగాణ రాష్ట్రం సాకారమైంది’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.
కేసీఆర్ కుటుంబం బంగారు కుటుంబంగా మారింది: కిషన్‌రెడ్డి
‘‘సకల జనుల నమ్మె, వంట వార్పులల్లో పాల్గొన్న ఉద్యమ కారులు ఎవ్వరూ బీఆర్ఎస్ పార్టీలో లేరు. గజ్వేల్‌లో రెండు సార్లు గెలిచిన సీఎం, ఏ ఒక్కసారి ప్రజలను కలువలేదు. గజ్వేల్‌లో ఓడిపోతాననే కేసీఆర్ కామారెడ్డికి వస్తున్నాడు. బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన కేసీఆర్ వారి కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చుకున్నాడు. రైతుల పక్షపాతి ప్రభుత్వం తెలంగాణలో రావాలి. ఏ ఒక్క టీచర్, ఫ్రొఫెసర్, లెక్చరర్ పోస్టులని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయలేదు. నోటిఫికేషన్ల పేరుతో నిరుద్యోగులని కేసీఆర్ మోసం చేస్తున్నాడు. కామారెడ్డి నుంచి మార్పు రావాలి. ఈటలను గజ్వేల్‌లో ఓడిస్తానని కేసీఆర్ అంటున్నారు.. కామారెడ్డిలో రమణారెడ్డి కేసీఆర్‌ని ఓడిస్తాడు. కేసీఆర్ ఈ ఎన్నికల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కేసీఆర్ ఓడిపోవడం ఖాయం. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కుటుంబ పాలన, రాజకార్ల పాలన కొనసాగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఊర్లో పది, పదిహేను బెల్ట్ దుకాణాలను అనుమతిచ్చింది’’ అని కిషన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.