తెలంగాణ వీణ, హైదరాబాద్ : అధికారంలో లేకుండానే మాకు అడిగినవన్నీ చేస్తున్న బండారి లక్ష్మారెడ్డి బిఅర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి, అత్యంత భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం అంటూ, హౌసింగ్ బోర్డు కాలనీ, ముస్లీమ్ వెల్ఫేర్ అసోషియేషన్ వారు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తమకు పెద్ద మజీద్లో నమాజ్ చదువుటకు ఒక షెడ్డు ఏర్పాటు చెయ్యాలని, అర్హులైన మైనారిటీలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, మైనారిటీ బందు లక్ష రూపాయలు ఇప్పించాలని కోరారు.