తెలంగాణ వీణ,శామీర్‌పేట: మండలంలోని లాల్ గడి మలక్ పేట్ గ్రామాల్లో శుక్రవారం పార్టీ ప్రచార కార్యాలయాలను ప్రారంభించి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షతులై బిఆర్ఎస్ కు మద్దతుగా నిలుస్తున్నారని అన్నారు. కెసిఆర్ నేతృత్వంలో ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి భ్రహ్మారథం పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి పార్టీ ని మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సుదర్శన్, ఎంపీపీ ఎల్లుభాయి బాబు, జడ్పీటీసీ అనిత లాలయ్య, సర్పంచ్ లు బాలమణి, ఆంజనేయులు, వనజ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ నాగరాజు, ఇందిరా రాజిరెడ్డి, పార్టీ అధ్యక్షులు మేడి రవి, బండి రవి, ఉపసర్పంచ్ రమేష్ యాదవ్, సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్య యాదవ్, డైరెక్టర్ భూమి రెడ్డి, నాయకులు మురళి , నర్సింహా రెడ్డి, ఆఫ్జాల్ ఖాన్, అంజిరెడ్డి, చందపాషా, మురళి చారీ, హరిశంకర్ గౌడ్, బాబు, నర్సింగ్ రావు, రమేష్, నగేష్, ఎల్లమయ్య తదితరులు పాల్గొన్నారు.