తెలంగాణ వీణ,శామీర్‌పేట: తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని పోతాయిపల్లి లో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ గారు హాజరై తూముకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్రారెంటీలను ప్రజలకి వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశాయని ప్రజల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మీరందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ లను ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తూముకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బి. జైపాల్ రెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి, పోతాయిపల్లి 15 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతల బల్వంత్ రెడ్డి, కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన కౌన్సిలర్ అభ్యర్థులు,మరియు మాజీ ప్రజా ప్రతినిధులు,మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కమిటీలో వివిధ హోదాలో ఉన్న నాయకులు,కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు,వివిధ వార్డుల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు,యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.