తెలంగాణ వీణ, అంతర్జాతీయం : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతుండడంతో లండన్ లోని తెలంగాణ పౌరులంతా బిఆర్ఎస్ పార్టీకు పూర్తిగా మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో నాచారం డివిజన్ కి చెందిన సందీప్ రెడ్డి, లండన్ బ్రిడ్జ్ దగ్గర ప్లకార్డ్ పట్టుకొని అటుగా వచ్చేవారందరికీ బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మేల్యే అభ్యర్ధి శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారికి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ వినూత్నంగా ప్రచారం చేశారు.