తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : ఏపీలో మద్యం అమ్మకాలపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు వైసీపీ ప్రభుత్వం ఎందుకు సమాధానం ఇవ్వడం లేదని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రశ్నించారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా… ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. జనసేన పార్టీతో బీజేపీ పొత్తు కొనసాగుతోందని… ఇతర పార్టీలతో పొత్తులపై ఎన్నికలకు ముందు పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ప్రజలకు నిజమైన సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని అన్నారు. సబ్ కే సాథ్, సబ్ కే వికాస్ పేరుతో ముందుకెళ్తున్నామని తెలిపారు.