తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : గన్నవరం మండలం కేసరపల్లి ఒకటో వార్డుకు రీకౌంటింగ్ నిర్వహించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు రీకౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్నికలు పూర్తయిన రెండున్నరేళ్ళ తరువాత రీకౌంటింగ్ నిర్వహించనుండటం గమనార్హం. పంచాయతీ ఎన్నికల రీకౌంటింగ్ 2021లో జరిగింది. కేసరపల్లి ఒకటో వార్డు నుంచి జాస్తి శ్రీధర్ బాబు, మూల్పూరి మాధవన్, నేరుసు శంకర్రావుల మధ్య పోటీ నెలకొంది. 2 ఓట్ల మెజార్టీతో మూల్పూరి మాధవన్ విజయం సాధించారు. తనకు అన్యాయం జరిగిందని కోర్టును అభ్యర్థి జాస్తి శ్రీధర్ బాబు ఆశ్రయించారు. గన్నవరం ఎంపీడీవో కార్యాలయంలో రీకౌంటింగ్ కొనసాగుతోంది.