తెలంగాణ వీణ , హైదరాబాద్ : కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడిని కొట్టడం ఎవరి తరం కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత అన్నారు. ఆయనకు ఆయనే సాటి అని… అయనను ఎదుర్కోవాలంటే మరో కేసీఆర్ పుట్టాలని చెప్పారు. కేసీఆర్ మనసు మహా సముద్రం అని, ఆయన ఆలోచన ఆకాశమని అన్నారు. ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయకుండా నిరుద్యోగులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఉద్యోగ నియామకాలను, ఈ పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన నియామకాలను పరిశీలిస్తే నిరుద్యోగులకు అన్యాయం చేసింది ఎవరో తెలుస్తుందని చెప్పారు.
కేసీఆర్ పాలనలో 2 లక్షల 32 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరిగిందని కవిత అన్నారు. వీటిలో లక్ష 60 వేల ఉద్యోగాల భర్తీ ఇప్పటికే జరిగిందని… మిగిలిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉందని చెప్పారు.