తెలంగాణ వీణ , మల్లాపూర్ : బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి అధ్యక్షతన మల్లాపూర్ విఎన్ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు.ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని, మేనిఫెస్టోను స్పష్టంగా వీడియోల రూపంలో సభ్యులకు వివరిస్తూ, పెద్ద ఎత్తున చెయ్యాల్సిన ప్రచారం, సోషల్ మీడియా పట్ల అవగాహన కల్పిస్తూ, తనదైన శైలిలో పదునైన మాటలతో సభ్యుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపి ఎన్నికల యుద్దానికి సిద్దం చేశారు. సింగర్ మిట్టపల్లి సురేందర్ కళాబృందం తమ ఆట పాటలతో సభ్యులను ఉత్తేజపరిచారు. కేసీఆర్, కేటీఆర్ పాటలకు సభ్యుల చప్పట్లతో వియన్ఆర్ గార్డెన్స్ దద్దరిల్లింది. సభాప్రాంగణం అంతా జై కేసీఆర్, జై కేటీఆర్, జై బిఎల్ఆర్ నినాదాలతో మారుమ్రోగిపోయింది.