తెలంగాణవీణ, జవహర్ నగర్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో 12వ వార్డు , 13 వ వార్డు నుండి బిఅర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి సుమారు 100 మంది మహిళ నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ లో చేరినారు. వారికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, మాజీ సర్పంచ్ కారంగుల శంకర్ గౌడ్ లు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భగా వారు మాట్లాడుతూ… టిఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న మహిళలకు గౌరవం లేదన్నారు. మంత్రి మల్లారెడ్డి ఇచ్చిన హామీలు ఇప్పటివరకు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. అనేకసార్లు మంత్రి మల్లారెడ్డి కి స్థానిక కార్పొరేటర్లకు విన్నవించుకున్న పట్టించుకోలేదన్నారు. ఎన్నికల సమీపిస్తున్న సందర్భంగా మళ్లీ జనాలను మోసం చేయాలని వారు చూస్తున్నారాని వారి మాటలను ఎవరు నమ్మి మోసపోవద్దని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మాట్లా వినయ్ కుమార్, నాయకులు రావుల ఐలయ్య, మల్లేష్ చారి, మూర్తి, వెంకటచారి తదితరులు పాల్గొన్నారు.