తెలంగాణ వీణ , ఉప్పల్ : సైనిక్ పురి క్యాంప్ కార్యాలయంలో ఉప్పల్ డివిజన్, ఇంద్రనగర్ నుండి కంటేస్టెడ్ కార్పొరేటర్ అరటికాయల భాస్కర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా బండారి లక్ష్మారెడ్డి వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ చేరికల కార్యక్రమంలో ఉప్పల్ డివిజన్ ప్రెసిడెంట్ వేముల సంతోష్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ మస్క సుధాకర్, అసూరి మల్లేష్, ఒక్కాస్ శ్రీరామ్, ఒక్కాస్ రాములు, పెద్దులాల్ శివ, చెరుకు శ్రీనివాస్, మస్కా తేజ్, ఆసూరి వినయ్, ఆసూరి సాయి, ఆసూరి శివ, తొక్కటి నవీన్, శివ, నవీన్, జంగయ్య, కిరణ్, దేవరాజు, పెరుముల రవి, వెంకటేశ్వర్లు, వినోద్, చందు తదితరులు పాల్గొన్నారు