తెలంగాణ వీణ , హైదరాబాద్ : పొద్దుగాల పది గంటల నుంచి రాత్రి ఏడు గంటల దాక డాక్టర్లు ఉంటున్నరు. దగ్గు, జెరం, షుగర్, బీపీ గోలీలు ఉత్తగనే ఇస్తున్నరు. గర్భిణులకు టెస్టులు చేస్తున్నరు. బలం గోలీలు ఇస్తున్నరు. ఈడికి వచ్చె ఓపిక లేకపోతె ఫోన్ చేస్తె సుత మందులు చెప్తున్నరు. బస్తీ దవాఖానలు వచ్చినంక మాకు చాలా పాయిదా అయితుంది. ఒకప్పుడు జెరమొస్తే ఖైరతాబాద్‌కో, గాంధీకో పోతుంటిమి. పొద్దంతా దవాఖాన సుట్టు తిరుగుడుకే సరిపోయేది. లేదంటే.. ప్రైవేట్ డాక్టర్. ఆడికి పోతే పైసల్ జాడియ్యాల్సి వస్తుండె.
పేదోళ్ల పానాల గురించి, ఆరోగ్యం గురించి ఆలోచించి కేసీఆర్ చేసిన బస్తీ దవాఖాన ఆలోచన మా అసోంటి పేదలకు ఎంతో మేలు చేశింది. ఇక్కడ గోలీలు ఫ్రీగ వస్తున్నయ్. మా గల్లీల ఉన్న దవాఖానకే రోజుకు వందలమంది వస్తుంటరు. డాక్టర్లు కూడా ఓపికగ చెక్ చేశి చెప్తున్నరు. అసొంటిది హైద్రాబాద్ మొత్తంల ఉన్న బస్తీ దవాఖానాలు ఎంతమందికి ఉపయోగపడుతున్నయో ఆలోచించుండ్రి. ప్రైవేట్ దవాఖానలల్ల కూడా దొరని సౌలతులు ఇకడ అయినయ్. ఇప్పుడు సుస్తీ చేస్తే బస్తీ దాటాల్సిన అవసరం లేదు. ఈసారి కూడా కేసీఆర్ సార్ గెలిస్తే.. బస్తీ దవాఖానలే సూపర్ స్పెషాలిటీ దవాఖానల లెక్క మారుతయేమో. నాకైతే ఆయనే వస్తడు.. చెప్పినవి చేస్తడన్న నమ్మకం ఉంది.