తెలంగాణ వీణ , హైదరాబాద్ : ప్రత్యేకమైతే చీకటైతదన్న రాష్ర్టాన్ని వెలుగు జిలుగులు చేసింది కేసీఆర్ సంక్షోభంలో ఉన్న ఎవుసాన్ని ‘సంక్షేమ’ సాగు చేసింది కేసీఆర్
ఎవుసం దండుగన్న చోట..పండుగోలె చేసింది కేసీఆర్
అన్నం లేక పస్తులున్న అన్నదాత దేశానికి అన్నం పెట్టేలా చేసింది కేసీఆర్
అభాగ్యులు మలిదశలో మంది దగ్గర చేయి చాచకుండా ఆసరా అయ్యింది కేసీఆర్
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో ఆడబిడ్ల పెండ్లికి ‘లక్ష’ణంగా సాయమయ్యింది కేసీఆర్
కేసీఆర్ కిట్‌తో.. పురిటికొచ్చిన ఆడబిడ్డకు సారె పెట్టింది కేసీఆర్
ఏండ్లుగా దగాపడ్డ దళితజాతికి దళితబంధువైంది కేసీఆర్
కులమతాల భేదం లేకుండా.. తెలంగాణను లౌకిక వేదికగా నిలిపింది కేసీఆర్
అందుకే ఆయనగాక ఇంకెవ్వరు? మన బతుకులకు కొత్త అర్థం చెప్పిన
కేసీఆర్‌కు సరి సాటెవ్వరు??