తెలంగాణ వీణ , నాచారం: ఉప్పల్ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలుపే లక్ష్యంగా అవిశ్రాంతంగా కష్టపడుతూ ప్రచారంలో జోరు పెంచిన బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి కారు టాప్ గేరులో దూసుకుపోతుంది.
ఈ నేపథ్యంలో నాచారం డివిజన్ లో కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ తో కలిసి ఇంటింటికి తిరుగుతూ, ఆత్మీయంగా అందర్నీ కలుస్తూ, ఓటర్ల సంపూర్ణ మద్దతు కూడగట్టుకుంటూ,జై కేసీఆర్, జై బిఎల్ఆర్ అంటూ కార్యకర్తల చేస్తున్న నినాదాల మధ్య పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న బండారి లక్ష్మారెడ్డి కి నాచారం ఓటర్లు పూల దండలు వేస్తూ, శాలువాలతో సత్కరిస్తూ, మహిళా ఓటర్లు మంగళ హారతులిస్తూ ఘనంగా స్వాగతం తెలిపారు.ఈ సందర్బంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఉప్పల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, అలాగే నాచారం డివిజన్ బాధ్యత తనదే అని హామీనిచ్చారు.వచ్చే ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయం అంటూ సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని ఆశీర్వదించాలని కోరారు.
తెలంగాణ ప్రజలకు భరోసా ఇస్తున్న కేసీఆర్, కారు గుర్తుకు ఓటు వేసి ఉప్పల్ నియోజకవర్గం నుండి బలమైన నాయకుడు బండారి లక్ష్మారెడ్డి ని లక్ష మెజారిటీతో గెలిపించుకుంటామని నాచారం ఓటర్లు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.