తెలంగాణ వీణ , క్రీడలు : విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచ్చినప్పుడే విజయాలు సాధ్యమౌతాయని విజ్ఞాన భారతి స్కూల్ కరస్పాండ్ గోనె హనుమంత్ రెడ్డి అన్నారు. ఖోఖో పోటిల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంపికైన తూంకుంట మునిసిపల్లోని విజ్ఞాన భారతి స్కూల్ విద్యార్థులను మంగళవారం అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో ఈ నెల 12 నుండి 15 వ తేది వరకు జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలలో స్కూల్ విద్యార్థి మజ్జి సాయికుమార్ 9వ తరగతి విద్యార్థి ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు తెలంగాణ రాష్ట్ర తరపున ఎన్నిక అయినట్లు తెలిపారు. వచ్చే నెల మహారాష్ట్రలో జరిగేటటువంటి జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అదేవిధంగా ఈనెల 30న సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించినటువంటి జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఖోఖో జట్టులో స్థానాన్ని మజ్జి యుగేందర్ ఆరవ తరగతి ,బన్నీ ఏడవ తరగతి విద్యార్థులు సాధించినట్లు వివరించారు. ఆ విద్యార్థులను అభినందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ భారతి స్కూల్ ప్రిన్సిపల్ బెంబిడి జంగారెడ్డి వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రశాంత్ రెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు.