తెలంగాణ వీణ ,మల్లాపూర్ : మల్లాపూర్ డివిజన్, కమలానగర్ లో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారి అధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యతిధిగా బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి పాల్గొని వారి సమస్యలు అన్ని తెలుసుకొని వాటికి తగిన పరిష్కార హామీలు ఇవ్వడంతో, తమకు భరోసా ఇస్తున్న బండారి లక్ష్మారెడ్డి బిఅర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి, ఉప్పల్ నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలిపిస్తామని సంపూర్ణ మద్దతు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో వ్యవస్థాపక అద్యక్షులు యల్లా రెడ్డి, సెక్రెటరీ చారి, సి.ఎన్. రావు, అమ్మెన శాస్త్రి , కొత్త రామారావు , పావని రెడ్డి తదితరులు పాల్గొన్నారు