తెలంగాణ వీణ,శామీర్‌పేట:శామీర్ పేట్ మండలం అలియాబాద్ గ్రామంలోని నడింగడ్డ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా దాతలు ఏర్పాటు చేసిన శ్రీ ప్రసన్న ఆంజనేయ విగ్రహాన్ని మంగళవారం ఇప్ప భ్రహ్మానంద రెడ్డి,రాంమోహన్ రావు,రవీందర్ రెడ్డి, అనిల్ వర్మ ల ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రచ్చారణాల మధ్య భక్తి శ్రద్దలతో జరిగింది. ఈ సందర్బంగా భక్తులు, ప్రజలు ప్రత్తేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సగ్గు శ్రీనివాస్ యాదవ్, రైతు బంధు మండల అధ్యక్షుడు కంటం కృష్ణా రెడ్డి, వార్డ్ సభ్యులు బండి రాంరెడ్డి, ముద్దం సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్, లక్ష్మణ్, బాలేష్, నర్సింహా, మల్లేష్ యాదవ్, రాజు యాదవ్, వెంకటేష్ , నాగరాజు, నరేష్ గౌడ్,సందీప్ గౌడ్, స్వామి,భక్తులు పాల్గొన్నారు.