తెలంగాణ వీణ,శామీర్‌పేట: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామంలో ప్రచార రదాన్ని సర్పంచ్ సింగం ఆంజనేయులు, ఎంపీటీసీ పారుపల్లి నాగరాజు లు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయం ఖాయం అన్నారు.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు, ఓటర్లు బిఆర్ఎస్ వైపే ఉన్నారని అన్నారు.మేడ్చల్ ఎమ్మెల్యే గా చామకూర మల్లారెడ్డి ని భారీ మెజారిటీ తో గెలిపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ అధ్యక్షుడు గోపాల్,కార్యకర్తలు,గ్రామస్తులు పాల్గొన్నారు.