తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌పై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. బాబుకు బెయిల్ వచ్చింది నిజం గెలిచి కాదు.. బాబుకు కళ్లు కనిపించడం లేదని కోర్టు మద్యంతర బెయిల్ ఇచ్చిందని సెటైరికల్‌గా ట్వీట్ చేశారు. స్కిల్ స్కాం కేసులో రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుకు అనారోగ్య కారణాలతో ఏపీ హైకోర్టు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఐదు కండిషన్లు విధిస్తూ నవంబర్ 28 వరకు బెయిల్ ఇచ్చింది.
నిబంధనల్లో భాగంగా కేసును ప్రభావితం చేసేలా వ్యవహరించకూడదని తెలిపింది. రాజకీయ కార్యకరలాపాల్లో పాల్గొనకూడదని, హాస్పిటల్, ఇంటికే పరిమితంకావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. రూ.లక్ష పూచీకత్తుతోపాటు ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని, నచ్చిన దవాఖానలో సొంత ఖర్చులతో చికిత్సచేయించుకోవచ్చిన తెలిపింది. అయితే చికిత్స, దవాఖానకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్‌లో రాజమండ్రి జైలు సూపరింటెండెంట్‌కు సమర్పించాలని పేర్కొంది.